టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేనితోపాటు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, రామ్‌కుమార్ రామనాథన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెల్‌బోర్న్‌లో బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో సహచరుడు రామ్‌కుమార్‌తో సాకేత్; జర్గెన్ జాప్ (ఎస్తోనియా)తో సోమ్‌దేవ్ తలపడతారు. క్వాలిఫయింగ్ ‘డ్రా’లో మొత్తం 128 మంది ఉన్నారు. 16 మందికి మెయిన్ ‘డ్రా’లో స్థానం లభిస్తుంది. ప్రధాన టోర్నమెంట్ ఈనెల 18 నుంచి 31 వరకు జరుగుతుంది.