ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్ లో సైనా, సింధు | Saina Nehwal, P.V. Sindhu in quarters of Australian Open | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్ లో సైనా, సింధు

Jun 26 2014 7:20 PM | Updated on Sep 2 2017 9:26 AM

ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్ , పి.వి సింధుల జైత్రయాత్ర కొనసాగుతోంది.

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్ , పి.వి సింధుల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఓపెన్ లో భాగంగా ఈ రోజు జరిగిన ప్రి క్వార్టర్స్ పోరులో వీరివురూ విజయాల్ని నమోదు చేసుకుని క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. ఆరో సీడ్ సైనా నెహ్వాల్.. తన ప్రత్యర్థి తులసీని 21-18, 21-15  పాయింట్ల తేడాతో మట్టికరిపించింది. కేవలం 40 నిమిషాల్లో సైనా ఈ మ్యాచ్ ను ముగించి తన సత్తాను మరోసారి చాటింది. మరో ప్రి కార్టర్స్ లో పి.వి.సింధు 21-13, 21-7 తేడాతో నికాన్ జిందాపాన్ ను ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది.

 

ఇదిలా ఉండగా పురుషల సింగిల్స్ లో సాయి ప్రణీత్ 15-21, 21-8,19-21 తేడాతో వాన్ జెన్ మింగ్ చేతిలో పరాజయం పాలైయ్యాడు. తొలి సెట్ ను చేజార్చుకున్న ప్రణీత్.. అనంతరం రెండో సెట్ ను గెలుచుకుని విజయం దిశగా పయనించాడు. కాగా, జింగ్ అద్వితీయంగా పుంజుకోవడంతో ప్రణీత్ కు ఓటమి తప్పలేదు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement