టైటిల్‌కు విజయం దూరంలో | Saina Nehwal a win away from Malaysia Masters title | Sakshi
Sakshi News home page

టైటిల్‌కు విజయం దూరంలో

Jan 22 2017 1:06 AM | Updated on Sep 5 2017 1:46 AM

టైటిల్‌కు విజయం దూరంలో

టైటిల్‌కు విజయం దూరంలో

కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేసేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఓ విజయం దూరంలో ఉంది.

మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ ఫైనల్లో సైనా  
సారావక్‌ (మలేసియా): కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేసేందుకు భారత బ్యాడ్మింటన్  స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఓ విజయం దూరంలో ఉంది. మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ అమ్మాయి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ సైనా 21–13, 21–10తో ఐదో సీడ్‌ యిప్‌ పుయ్‌ యిన్  (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించింది. ఓవరాల్‌ కెరీర్‌లో యిప్‌ పుయ్‌ యిన్ పై సైనాకిది ఏడో విజయం కావడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా ఆడుతుంది.

రెండో సెమీఫైనల్లో పోర్న్‌పవీ 21–19, 20–22, 21–18తో ప్రపంచ 19వ ర్యాంకర్‌ చెయుంగ్‌ ఎన్గాన్  యి (హాంకాంగ్‌)పై సంచలన విజయం సాధించింది. 32 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో సైనాకు తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. ఒకదశలో 9–12తో వెనుకబడిన సైనా వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 14–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఒక పాయింట్‌ చేజార్చుకున్న సైనా మళ్లీ చెలరేగి ఈసారి వరుసగా ఏడు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌ ఆరంభంలో సైనా 6–0తో ముందంజ వేసి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement