రన్నరప్ సాకేత్ | Runner-up Saket | Sakshi
Sakshi News home page

రన్నరప్ సాకేత్

Feb 22 2016 12:25 AM | Updated on Sep 4 2018 5:07 PM

రన్నరప్ సాకేత్ - Sakshi

రన్నరప్ సాకేత్

ఫైనల్ చేరే క్రమంలో నిలకడగా రాణిం చిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని కీలకమైన టైటిల్ పోరులో

న్యూఢిల్లీ:  ఫైనల్ చేరే క్రమంలో నిలకడగా రాణిం చిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని కీలకమైన టైటిల్ పోరులో తడబడ్డాడు. ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ సాకేత్ 3-6, 0-6తో స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. గంటలోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ వరుసగా పది గేమ్‌లు కోల్పోయాడు. తొలి సెట్‌లో కాస్త పోటీనిచ్చిన అతను రెండో సెట్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. రన్నరప్‌గా నిలిచిన సాకేత్‌కు 4,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 91 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సాకేత్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-150లోకి వచ్చే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement