క్వార్టర్స్‌లో ఓడిన రుత్విక | rthuvika lost her game in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో ఓడిన రుత్విక

Sep 9 2017 1:38 AM | Updated on Sep 12 2017 2:16 AM

వియత్నాం ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రుత్విక శివాని

హో చి మిన్‌ (వియత్నాం): వియత్నాం ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రుత్విక శివాని 21–18, 15–21, 8–21తో దినర్‌ అయుస్టీన్‌ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లోనూ లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు.

జపాన్‌కు చెందిన కొడై నరోఓకా 21–17, 21–23, 21–10తో లక్ష్యసేన్‌పై గెలిచాడు. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన అర్జున్‌– శ్లోక్‌ ద్వయం సెమీస్‌కు చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement