‘రాయల్’గా నిలిచారు | Royal Challengers team won agaist Sunrisers | Sakshi
Sakshi News home page

‘రాయల్’గా నిలిచారు

May 16 2015 1:55 AM | Updated on Sep 3 2017 2:06 AM

‘రాయల్’గా నిలిచారు

‘రాయల్’గా నిలిచారు

టి20 క్రికెట్‌లో ఉత్కంఠను పరాకాష్టకు చేర్చిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.

నాటకీయ మ్యాచ్‌లో బెంగళూరు సంచలన విజయం
భారీ స్కోరు చేసినా ఓడిన సన్‌రైజర్స్   గేల్, కోహ్లి మెరుపులు

 
 ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్... వర్షం కారణంగా రకరకాలుగా మారుతున్న సమీకరణాలు... 6 ఓవర్లలో 81 పరుగుల లక్ష్యం... ఈ సవాల్‌ను బెంగళూరు ‘రాయల్’గా అధిగమించింది. సన్‌రైజర్స్‌పై గెలిచి ప్లేఆఫ్‌కు చేరువయింది. ఇటు హైదరాబాద్ జట్టు నాకౌట్‌కు చేరాలంటే కచ్చితంగా తమ చివరి మ్యాచ్‌లో ముంబైపై గెలవాల్సిందే.
 
 సాక్షి,హైదరాబాద్ : టి20 క్రికెట్‌లో ఉత్కంఠను పరాకాష్టకు చేర్చిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం వర్షం కారణంగా రకరకాల సమీకరణాలతో జరిగిన మ్యాచ్‌లో బెంగ ళూరు ఆరు వికెట్లతో నెగ్గింది.
 వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో... తొలుత బ్యాటింగ్‌కు దిగన హైదరాబాద్ 11 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు చేసింది. హెన్రిక్స్ (22 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), వార్నర్ (32 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. హెన్రిక్స్, వార్నర్ రెండో వికెట్‌కు కేవలం 43 బంతుల్లోనే ఓవర్‌కు 14.37 రన్‌రేట్‌తో ఏకంగా 103 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత మళ్లీ వర్షం రావడంతో బెంగళూరుకు 6 ఓవర్లలో 81 పరుగుల లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో నిర్దేశించారు. రాయల్ చాలెంజర్స్ 5.5 ఓవర్లలో 4 వికెట్లకు 83 పరుగులు చేసింది. కోహ్లి (19 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), గేల్ (10 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు.

 హెన్రిక్స్ దూకుడు: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. హర్షల్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని వార్నర్ ఫోర్ బాదడంతో సన్ ఖాతాలో తొలి బౌండరీ చేరింది. అయితే వీస్ వేసిన మరుసటి ఓవర్లో ధావన్ (8) వెనుదిరిగాడు. స్పిన్నర్ చహల్ వేసిన ఓవర్లో 17, ఆ తర్వాత దిండా ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఏకంగా 21 పరుగులు లభించాయి.  26, 46 పరుగుల వద్ద హెన్రిక్స్ ఇచ్చిన క్యాచ్‌లను బెంగళూరు ఫీల్డర్లు జారవిడవగా, 46 వద్ద సునాయాస రనౌట్ అవకాశం కూడా తప్పింది. ఈ జోరులో హెన్రిక్స్ 20 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. మరో వైపు 30 బంతుల్లో వార్నర్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది.

 గేల్ మెరుపులు: 13.5 రన్‌రేట్‌తో విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు మెరుపు ఆరంభం లభించింది. స్టెయిన్ వేసిన తొలి ఓవర్లో గేల్ 4, 6 బాదితే కోహ్లి ఒక ఫోర్ కొట్టాడు. ఫలితంగా 17 పరుగులు....రెండో ఓవర్లోనైతే భువీ బౌలింగ్‌లో గేల్ వీరబాదుడు. ఏకంగా 2 సిక్సర్లు, 3 ఫోర్లుతో 24 పరుగులు బాదాడు. అయితే మూడో ఓవర్ వేసిన హెన్రిక్స్ వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు తీసి ఉత్కంఠ రేపాడు. గేల్, డివిలియర్స్ (0) వరుస బంతుల్లో అవుటయ్యారు. అయితే 11 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్న కోహ్లి చివరి వరకూ నిలిచి జట్టును గెలిపించాడు.

 స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : వార్నర్ (నాటౌట్) 52; ధావన్ (సి) దిండా (బి) వీస్ 8; హెన్రిక్స్ (సి) కార్తీక్ (బి) వీస్ 57; మోర్గాన్ (సి) మన్‌దీప్ (బి) స్టార్క్ 11; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (11 ఓవర్లలో 3 వికెట్లకు) 135.
 వికెట్ల పతనం : 1-19; 2-122; 3-135.
 బౌలింగ్ : స్టార్క్ 3-0-26-1; హర్షల్ 2-0-30-0; వీస్ 2-0-20-2; దిండా 2-0-23-0; చహల్ 2-0-34-0.

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి) ధావన్ (బి)హెన్రిక్స్ 35; కోహ్లి (నాటౌట్) 44; డివిలియర్స్ (సి) స్టెయిన్ (బి)హెన్రిక్స్ 0; మన్‌దీప్ (సి) మోర్గాన్ (బి) ప్రవీణ్ 1; కార్తీక్ (రనౌట్) 2; సర్ఫరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (5.5 ఓవర్లలో 4 వికెట్లకు) 83.
 వికెట్ల పతనం : 1-43; 2-43; 3-58; 4-69.
 బౌలింగ్ : స్టెయిన్ 1-0-17-0; భువనేశ్వర్ 1.5-0-39-0; హెన్రిక్స్ 1-0-3-2; కరణ్ 1-0-14-0; ప్రవీణ్ 1-0-10-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement