రాయల్‌ చాలెంజర్స్‌ కు మేజర్‌ బూస్ట్‌ | Royal Challengers Bangalore have received a major boost | Sakshi
Sakshi News home page

రాయల్‌ చాలెంజర్స్‌ కు మేజర్‌ బూస్ట్‌

Apr 13 2017 2:16 PM | Updated on Sep 5 2017 8:41 AM

రాయల్‌ చాలెంజర్స్‌ కు మేజర్‌ బూస్ట్‌

రాయల్‌ చాలెంజర్స్‌ కు మేజర్‌ బూస్ట్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు అమితోత్సాహానిచ్చే వార్త అందింది.

న్యూఢిల్లీ: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు అమితోత్సాహాన్ని ఇచ్చే వార్త అందింది. గాయంతో ఐపీఎల్‌ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రేపు బరిలోకి దిగనున్నాడు. శుక్రవారం బెంగళూరులో ముంబై ఇండియన్స్‌ తో జరిగే మ్యాచ్ లో ఆడడేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి ఫిట్‌ గా ఉన్నాడని బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ ధ్రువీకరించింది. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకున్నాడని అధికారికంగా వెల్లడించింది.

‘కుడి భుజంకు గాయం కావడంతో కోహ్లి వైద్యశిబిరంలో చికిత్స పొందాడు. అతడు ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఐపీఎల్‌-10లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడ’ని బీసీసీఐ తెలిపింది. తమ కెప్టెన్‌ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ ఎదురుచూస్తోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ లు ఆడిన ఆర్సీబీ రెండిట్లో ఓడి ఒక మ్యాచ్‌ లో గెలిచింది. ‘మిస్టర్‌ ఫైర్‌’   కెప్టెన్సీలో ఆర్సీబీ వరుస విజయాల బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement