బోపన్న భాగస్వామిగా ఆస్ట్రేలియా ఓపెన్‌ బరిలో..

Rohan Bopanna To Pair Up With Sania Mirza At Australian Open - Sakshi

సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత మహిళల టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భాగస్వామి మారాడు. ఈ టోర్నీలో అమెరికా ఆటగాడు రాజీవ్‌ రామ్‌తో కలిసి ఆడాల్సిన సానియా... ఇప్పుడు భారత్‌కు చెందిన డబుల్స్‌ నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్నతో కలిసి బరిలోకి దిగనుంది. రాజీవ్‌ రామ్‌ గాయపడటంతో అతను ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి వైదొలిగాడు. దాంతో బోపన్నతో కలిసి సానియా ఆడాలని నిర్ణయించుకుంది. రియో ఒలింపిక్స్‌ తర్వాత సానియా, బోపన్న కలిసి ఆడనుండటం ఇదే తొలిసారి. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ ఈనెల 20న ప్రారంభమవుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top