రియో నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్ | Richard Gasquet pulls out of Rio Olympics with back injury, replaced by Benoit Paire | Sakshi
Sakshi News home page

రియో నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్

Jul 19 2016 1:49 PM | Updated on Sep 4 2017 5:19 AM

రియో నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్

రియో నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్

ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ రిచర్డ్ గాస్కెట్ రియో ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు.

ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ రిచర్డ్ గాస్కెట్ రియో ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. వెన్నెముక సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న వరల్డ్ 14 ర్యాంకర్ గాస్కెట్ రియోలో పాల్గొనడం లేదని ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ వెల్లడించింది. అతడి స్థానంలో బెనాయిట్ పెయిర్ కు అవకాశమిచ్చారు. ఇటీవల వింబుల్డన్ గ్రాండ్స్లామ్ లో దేశానికే చెందిన సోంగా తో మ్యాచ్ ఆడుతూ గాయం కారణంగా మధ్యలోనే తప్పుకున్నాడు.

2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఆడే అవకాశం రాలేదు. అయితే ఆ తర్వాత జరిగిన లండన్ ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో జులియన్ బిన్నెటా తో కలిసి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకోకపోవడంతో వరుసగా రెండో ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించాలన్న రిచర్డ్ గాస్కెట్ కల నెరవేరడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement