దినేశ్ కార్తీక్కు జరిమానా | RCB's Dinesh Karthik fined | Sakshi
Sakshi News home page

దినేశ్ కార్తీక్కు జరిమానా

May 17 2015 4:31 PM | Updated on Sep 3 2017 2:14 AM

దినేశ్ కార్తీక్కు జరిమానా

దినేశ్ కార్తీక్కు జరిమానా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ దినేశ్ కార్తీక్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించారు.

హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ దినేశ్ కార్తీక్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దినేశ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రెఫరీ రోషన్ మహానామా చర్యలు తీసుకున్నారు.

ఐపీఎల్ ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. 'దినేశ్ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు రోషన్ మహానామా గుర్తించారు. ప్రవర్తనా నియమావళి లెవెల్ 1 కింద అతనిపై చర్యలు తీసుకున్నారు' అని ఐపీఎల్ ఆ ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement