అశ్విన్‌కు సోబర్స్‌ ట్రోఫీ... | Ravichandran Ashwin receives Sir Garfield Sobers Trophy | Sakshi
Sakshi News home page

అశ్విన్‌కు సోబర్స్‌ ట్రోఫీ...

Mar 29 2017 12:40 AM | Updated on Sep 5 2017 7:20 AM

అశ్విన్‌కు సోబర్స్‌ ట్రోఫీ...

అశ్విన్‌కు సోబర్స్‌ ట్రోఫీ...

ధర్మశాల టెస్టు ముగిసిన తర్వాత భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) రెండు పురస్కారాలను అందజేసింది.

ధర్మశాల టెస్టు ముగిసిన తర్వాత భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) రెండు పురస్కారాలను అందజేసింది. 2016 సంవత్సరానికి అశ్విన్‌ ‘ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’... ‘ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ చేతులమీదుగా అశ్విన్‌ ‘గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ’ అందుకున్నాడు.

 ‘ఐసీసీ ద్వారా రెండు ఉత్తమ పురస్కారాలకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. స్వదేశంలో ఈ రెండు అవార్డులను అందుకున్నందుకు నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. ఈ సందర్భంగా నా సహచరులకు, కుటుంబసభ్యులకు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement