‘టాప్‌’లేపిన రషీద్‌ ఖాన్‌ | Rashid Khan Consolidates His Position at Top of ICC T20I Rankings | Sakshi
Sakshi News home page

‘టాప్‌’లేపిన రషీద్‌ ఖాన్‌

Jun 9 2018 11:34 AM | Updated on Mar 28 2019 6:10 PM

Rashid Khan Consolidates His Position at Top of ICC T20I Rankings - Sakshi

దుబాయ్‌: అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టిన రషీద్‌.. మొత్తంగా 813 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.  బంగ్లాదేశ్‌తో సిరీస్‌ తర్వాత 54 రేటింగ్‌ పాయింట్లను ఖాతాలో వేసుకున్న రషీద్‌ తన టాప్‌ ర్యాంకును పదిలం చేసుకున్నాడు.

ఇక్కడ పాకిస్థాన్‌కు చెందిన షాదబ్‌ ఖాన్‌ కంటే 80 పాయింట్లు ముందంజలో ఉన్న రషీద్‌ ఖాన్‌.. నంబర్‌వన్‌ ర్యాంకును కాపాడుకున్నాడు. ఇక అఫ్గానిస్తాన్‌కే చెందిన మహ్మద్‌ నబీ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 8వ ర్యాంకులో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement