అంతర్ జిల్లా సీనియర్ ఖోఖో టోర్నమెంట్‌లో రంగారెడ్డి జిల్లా పురుషుల, మహిళల జట్లు సత్తా చాటాయి.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సీనియర్ ఖోఖో టోర్నమెంట్‌లో రంగారెడ్డి జిల్లా పురుషుల, మహిళల జట్లు సత్తా చాటాయి. కరీంనగర్ జిల్లా మంథనిలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల విభాగం ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 10-6 స్కోరుతో కరీంనగర్ జట్టు చేతిలో ఓడిపోయి రెండో స్థానం దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా జట్టులో అంకిత్, రంజిత్ కుమార్, ప్రవీణ్ చక్కటి ప్రతిభ కనబర్చారు. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి జట్టు 10-9తో ఆదిలాబాద్ జట్టుపై గెలిచింది.
మహిళల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా జట్టు 5-4తో నిజామాబాద్ జట్టుపై గెలిచి మూడో స్థానం పొందింది. రంగారెడ్డి జిల్లాలో లక్ష్మీ, రేణుక రాణించారు. అలాగే ఈ టోర్నీలో పురుషుల విభాగంలో బెస్ట్ రన్నర్‌గా అంకిత్ ఎంపికవగా, అత్యుత్తమ క్రీడాకారిణిగా రేణుక ఎంపికైంది. ముగింపు వేడుకలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు.