
2011 ప్రపంచకప్ ఫైనల్‌పై విచారణ జరపాలి
భారత్‌తో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక ఓటమిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అనుమానం వ్యక్తం చేశారు.
అర్జున రణతుంగ డిమాండ్
కొలంబో: భారత్‌తో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక ఓటమిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ కోణం ఉందని, విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో లంక ఆరు వికెట్ల తేడాతో ఓడటం తనను షాక్‌కు గురి చేసిందని అన్నారు. ‘ఆ సమయంలో నేను కామెంటేటర్‌గా భారత్‌లోనే ఉన్నాను. మా జట్టు ఓడటం నన్ను బాధించింది. అలాగే ఆ ఓటమిపై నాకు అనుమానంగా ఉంది. అందుకే దీనిపై విచారణ జరగాలి. అన్ని విషయాలను నేను ఇప్పుడు వెల్లడించలేను.
కానీ ఏదో ఒకరోజు ఆధారాలతో సహా బయటపెడతా. అయితే విచారణ మాత్రం జరగాలి. ఆటగాళ్లు తమ అనైతికతను కాపాడుకోలేరు’ అని రణతుంగ వీడియో సందేశం ద్వారా అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌లో సరైన భద్రత లేనప్పటికీ 2009లో లంక జట్టును అక్కడికి పంపించడంపై విచారణ జరపాలని సంగక్కర డిమాండ్ చేయడంతో రణతుంగ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఓటమిని తెరపైకి తేవడం గమనార్హం.