సెమీస్‌లో ప్రజ్నేశ్‌ | Prajnes Gunasevaran is in the Semi Finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ప్రజ్నేశ్‌

Apr 20 2019 4:28 AM | Updated on Apr 20 2019 4:28 AM

Prajnes Gunasevaran is in the Semi Finals - Sakshi

న్యూఢిల్లీ: కున్‌మింగ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 7–5, 6–3తో పదో సీడ్‌ నికోలా మిలోజెవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో భారత రెండో ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ 1–6, 6–7 (4/7)తో ఐదో సీడ్‌ కామిల్‌ మజార్జక్‌ (పోలాండ్‌) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–జెమీ సెరాటాని (అమెరికా) ద్వయం 6–7 (9/11), 6–4, 9–11తో యాన్‌ బాయ్‌–ఫాజింగ్‌ సన్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.    

Advertisement
 
Advertisement
Advertisement