తన సందేహాస్పద బౌలింగ్ శైలిని మరోసారి పరీక్షించుకునేందుకు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నేడు చెన్నై వెళ్లనున్నాడు. ఈనెల 18న బీసీసీఐ... ఓజాకు నిర్వహించిన పరీక్షలో అతడి బౌలింగ్‌లో లోపాలున్నట్టు తేల్చి నిషేధం విధించింది.
సాక్షి, హైదరాబాద్: తన సందేహాస్పద బౌలింగ్ శైలిని మరోసారి పరీక్షించుకునేందుకు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నేడు చెన్నై వెళ్లనున్నాడు. ఈనెల 18న బీసీసీఐ... ఓజాకు నిర్వహించిన పరీక్షలో అతడి బౌలింగ్‌లో లోపాలున్నట్టు తేల్చి నిషేధం విధించింది.
అయితే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి ఓజాకు బయో మెకానికల్ టెస్టును జరపాల్సిందిగా బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దీంతో తను నేడు చెన్నై పరీక్షా కేంద్రానికి వెళుతున్నట్టు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శి విజయానంద్ తెలిపారు.