
కమ్రాన్ అక్మల్
వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌పై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి.
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌పై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. అంతర్జాతీయ, డొమెస్టిక్ క్రికెట్‌లో 2017-18లో అద్బుత ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బుధవారం అవార్డులు ప్రకటించింది. డొమెస్టిక్ క్రికెట్‌లో భాగంగా బెస్ట్ వికెట్ కీపర్ అవార్డు కమ్రాన్ అక్మల్‌ను వరించింది. అయితే కమ్రాన్ బెస్ట్ వికెట్ కీపర్ ఏంటనీ? జోకులొద్దని ఆ దేశ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘నేను విన్నది నిజమా? జోక్ చేయకురబ్బా..’ అని ఒకరు కామెంట్ చేయగా.. బెస్ట్ వికెట్ కీపర్ అక్మల్ దక్కిందంటే.. మన డొమెస్టిక్ క్రికెట్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని మరొకరు కామెంట్ చేశారు. ఇంత చెత్త ఆటగాడు బెస్ట్ కీపర్ అయితే పాక్‌లో వికెట్ కీపర్‌ల కొరత ఉన్నట్లేనని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
ఇటీవల జింబాబ్వేపై డబుల్ సెంచరీ సాధించిన ఫకార్ జమాన్‌కు 2.5 మిలియన్ల రూపాయలతో ప్రత్యేక అవార్డును అందజేశారు. బెస్ట్ టెస్ట్ ప్లేయర్‌గా మహమ్మద్ అబ్బాస్, వన్డే ప్లేయర్‌గా హసన్ అలీలు అవార్డులు అందుకున్నారు.
What did i just read??
— NasreeN (@Nas_k27) August 8, 2018
R u serious?
No i mean is this a joke or what?
Kamran Akmal for the best WK????😳😳😫😭pls someone tell me it was an error
RIP Talent! https://t.co/UwcR9kn001