ఓవరాల్ చాంప్ కేఎంజేసీ | Overall Champ KMJC | Sakshi
Sakshi News home page

ఓవరాల్ చాంప్ కేఎంజేసీ

Sep 11 2013 1:14 AM | Updated on Sep 1 2017 10:36 PM

ఇంటర్ జూనియర్ కాలేజి ఫెన్సింగ్ టోర్నమెంట్‌లో ఓవరాల్ బాలుర టీమ్ టైటిల్‌ను కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి (కేఎంజేసీ) చేజిక్కించుకుంది.

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్:  ఇంటర్ జూనియర్ కాలేజి ఫెన్సింగ్ టోర్నమెంట్‌లో ఓవరాల్ బాలుర టీమ్ టైటిల్‌ను కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి (కేఎంజేసీ) చేజిక్కించుకుంది. బాలికల టీమ్ టైటిల్‌ను సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య (హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఓల్డ్ మలక్‌పేట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజిలో మంగళవారం ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కేఎంజేసీ క్రీడాకారులు ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలను గెలుచుకున్నారు. కార్యక్రమానికి హాజరైన గవర్నమెంట్ జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ స్వరూప వాణి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎల్.రాజేంద్ర ప్రసాద్, రామారావు, పీడీ రమణ తదితరులు పాల్గొన్నారు.
 
 ఫైనల్స్ ఫలితాలు
 బాలుర విభాగం: సాబ్రే ఈవెంట్ :1. కె.సనీత్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 2. పి.రవి (జీజేసీ ఓల్డ్ మలక్‌పేట్), 3. వి.సాయినాధ్ (కేఎంజేసీ), ఎ.మహేష్ (జీజేసీ కూకట్‌పల్లి). ఈపీ ఈవెంట్: 1. ఎల్.శ్రీకర్ ప్రసాద్ (నారాయణ జూనియర్ కాలేజి), 2. కె.సాయి కృష్ణ (నారాయణ జూనియర్ కాలేజి), 3. రమేష్ నాయక్ (కేఎంజేసీ), ఎన్.రోహిత్ (కేఎంజేసీ). ఫాయిల్ ఈవెంట్: 1. సాయితరుణ్ (కేఎంజేసీ), 2. పి.టి.నారాయణ (కేఎంజేసీ), 3. ప్రభాకర్ (కేఎంజేసీ), రాందాస్ (కేఎంజేసీ).
 
 బాలికల విభాగం: సాబ్రే ఈవెంట్: కావ్యశ్రీ (సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి), 2. ఎస్.రచన (సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి), 3. అయేషా (విజయనగర్ జూనియర్ కాలేజి), జి.సాహిత్య (శ్రీగాయత్రీ జూనియర్ కాలేజి). ఈపీ ఈవెంట్: 1.మాన్విత (శ్రీగాయత్రీ జూనియర్ కాలేజి), 2. కావ్యశ్రీ (సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి), 3. పి.భావన (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), ఎస్.రవళిక (సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి). ఫాయిల్ ఈవెంట్: 1. మాన్విత (శ్రీగాయత్రీ జూనియర్ కాలేజి), 2.పి. భావన (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 3. షమీల (శ్రీగాయత్రీ జూనియర్ కాలేజి), బి.రవళిక ( సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి).
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement