టాప్స్‌ నుంచి రెజ్లర్‌ సాక్షి ఔట్‌ | Olympic Medallist Sakshi Malik Removed From TOPS | Sakshi
Sakshi News home page

టాప్స్‌ నుంచి రెజ్లర్‌ సాక్షి ఔట్‌

Oct 5 2019 3:59 AM | Updated on Oct 5 2019 3:59 AM

Olympic Medallist Sakshi Malik Removed From TOPS

న్యూఢిల్లీ: తెలుగు తేజం, వెయిట్‌లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌ టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)కు దూరమయ్యాడు. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌తో పాటు రాహుల్‌ని ఆ పథకం నుంచి భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) తొలగించింది. రెజ్లర్‌ సాక్షి గత కొంతకాలంగా నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. గుంటూరుకు చెందిన వెంకట్‌ కూడా కొంతకాలంగా గాయం కారణంగా అంతర్జాతీయ టోరీ్నలకు దూరంగా ఉన్నాడు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ఒలింపిక్‌ విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని తెచ్చారు. కోచింగ్, ఇతర వసతులతో పాటు టాప్స్‌లో ఉన్న క్రీడాకారులకు నెలకు రూ. 50 వేల చొప్పున ఆరి్థక సాయం అందజేస్తారు.

క్రీడాకారులకు అండదండలు అం దించే ఈ పథకంలో కొత్తగా రెజ్లర్‌ రవి దహియాకు చోటు దక్కింది. అతను ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల కేటగిరీలో కాంస్యం గెలిచాడు. ఆ ఈవెంట్‌లో సాక్షి (62 కేజీలు) కూడా తలపడింది. కానీ... తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. హైదరాబాదీ వెటరన్‌ షట్లర్‌ సైనా నెహా్వల్‌ తనకు వ్యక్తిగత ట్రెయినర్‌ సేవల్ని పొడిగించాలన్న అభ్యర్థనను ‘సాయ్‌’ మన్నించింది. ఈ ఏడాది డిసెంబర్‌ ఆఖరు దాకా ఆమె వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ స్వరూప్‌ సిన్హా ఏడు అంతర్జాతీయ టోర్నీల్లో ఆమెతో పాటు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల్ని ‘సాయ్‌’ భరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement