హైదరాబాద్‌ను వీడనున్న ఓజా!


 బెంగాల్ తరఫున బరిలోకిహైదరాబాద్ : లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టు హైదరాబాద్‌ను వీడనున్నాడు. 2015-16 సీజన్‌నుంచి అతను బెంగాల్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అనుమతి కూడా మంజూరు చేసింది. ఓజాతో చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని సౌరవ్ గంగూలీ కూడా వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top