చాంపియన్స్‌ ఓక్రిడ్జ్, ఫ్యూచర్‌ కిడ్స్‌ | Oakridge Future Kids Emerge Champions in Basketball League | Sakshi
Sakshi News home page

Aug 8 2018 9:42 AM | Updated on Aug 8 2018 9:42 AM

Oakridge Future Kids Emerge Champions in Basketball League - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ (ఐఎస్‌బీఎల్‌)లో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌ జట్లు విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) వేదికగా మంగళవారం జరిగిన బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ జట్టు 73–53తో ఫ్యూచర్‌ కిడ్స్‌పై విజయం సాధించింది. విజేత జట్టు తరఫున శ్రీరామ్‌ 27 పాయింట్లతో చెలరేగిపోగా... ఆయుష్‌ 17, సత్య 13, రోహన్‌ 12 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఫ్యూచర్‌ కిడ్స్‌ తరఫున అద్యాన్‌ 15, అఖిల్‌ 13, అనీశ్‌ 12 పాయింట్లు సాధించారు. బాలికల ఫైనల్లో ఫ్యూచర్‌ కిడ్స్‌ జట్టు 50–18తో చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ను చిత్తు చేసి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. విజేత జట్టు తరఫున మధుర 16, భావన 14, శ్రీయ 8 హిత 6 పాయింట్లు చేయగా... చిరెక్‌ జట్టు తరఫున ధాత్రి 5, శ్రీయ 4 పాయింట్లు సాధించారు. 

బాలుర విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ 49–23తో  రాకెల్‌ఫోర్డ్‌ ఇంటర్నేషనల్‌ జట్టుపై గెలిచింది. విజేత జట్టు తరఫున యశ్‌ 17, రామ్‌ 11 పాయింట్లు చేశారు. రాకెల్‌ఫోర్డ్‌ జట్టు తరఫున నాథన్‌ 16 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. బాలికల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సెయింట్‌ ఆండ్రూస్‌ హైస్కూల్‌ 32–22తో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌)పై నెగ్గింది. విజేత జట్టు తరఫున నిధి 16, హిమజ 10 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బాస్కెట్‌బాల్‌ కోచ్‌లు రవీందర్, నయీముద్దీన్‌లు విజేతలకు ట్రోఫీలు అందజేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement