‘బకాయిలు చెల్లించడం లేదు’ | "Not paying dues' | Sakshi
Sakshi News home page

‘బకాయిలు చెల్లించడం లేదు’

Feb 3 2017 12:55 AM | Updated on Sep 5 2017 2:44 AM

తనకు రావాల్సిన బకాయిలపై న్యాయపోరాటానికి దిగేందుకు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌

న్యూఢిల్లీ: తనకు రావాల్సిన బకాయిలపై న్యాయపోరాటానికి దిగేందుకు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆటగాడు మార్సెలో పెరీరా సిద్ధమవుతున్నాడు. ఐఎస్‌ఎల్‌ మూడో సీజన్‌లో గోల్డెన్‌ బూట్‌ అవార్డు దక్కించుకున్న ఈ ఆటగాడికి ఢిల్లీ ఫ్రాంచైజీ 2500 డాలర్లను చెల్లించాల్సి ఉంది.

లీగ్‌ సందర్భంగా పెరీరా చేసే ఒక్కో గోల్‌కు వెయ్యి డాలర్ల చొప్పున చెల్లించేందుకు ఢిల్లీ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. తను మొత్తం పది గోల్స్‌ చేయడంతో పాటు గోల్డెన్‌ బూట్‌ గెలుచుకున్నందుకు 15వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement