నిషాంత్, అనికేత్‌లకు స్వర్ణాలు | Nishanat, Aniket got Gold Medals | Sakshi
Sakshi News home page

నిషాంత్, అనికేత్‌లకు స్వర్ణాలు

Dec 4 2018 10:03 AM | Updated on Dec 4 2018 10:03 AM

Nishanat, Aniket got Gold Medals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో తెలంగాణ అథ్లెట్లు  2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించారు. సోమ వారం జరిగిన బాలుర 200మీ. పరుగులో హైదరాబాద్‌కు చెందిన అనికేత్‌ విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 22.62సెకన్లలో చేరుకొని పసిడి పతకాన్ని అందుకున్నాడు. 1000మీ. పరుగులో నిషాంత్‌ శర్మ స్వర్ణాన్ని సాధించాడు. నిషాంత్‌ వేగంగా 2నిమిషాల 45.65 సెకన్లలో పరుగును పూర్తి చేశాడు.  100మీ. హర్డిల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన పద్మశ్రీ రజతాన్ని గెలుచుకుంది. బాలుర (12–14) 600మీ. పరుగులో జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన వినోద్‌ రన్నరప్‌గా నిలిచాడు. బాలికల 400మీ. పరుగులో నందిని (మేడ్చల్‌), 1000మీ. పరుగులో భాగ్యలక్ష్మి (నాగర్‌ కర్నూల్‌)  చెరో కాంస్యాన్ని గెలుచుకున్నారు.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement