రోస్‌బర్గ్... మూడోసారి | Nico Rosberg beats Lewis Hamilton to pole in Russian GP | Sakshi
Sakshi News home page

రోస్‌బర్గ్... మూడోసారి

Oct 11 2015 12:50 AM | Updated on Aug 21 2018 9:00 PM

సహచరుడు లూయిస్ హామిల్టన్ జోరుకు పగ్గాలు వేస్తూ మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో మూడోసారి

 మెర్సిడెస్ డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’    నేడు రష్యా గ్రాండ్‌ప్రి
 సోచి (రష్యా): సహచరుడు లూయిస్ హామిల్టన్ జోరుకు పగ్గాలు వేస్తూ మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో మూడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 37.113 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానం నుంచి, బొటాస్ (విలియమ్స్) మూడో స్థానం నుంచి, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్‌లో జరిగిన 14 రేసుల్లో హామిల్టన్ తొమ్మిదింటిలో నెగ్గగా... రోస్‌బర్గ్ మూడింటిలో, వెటెల్ రెండింటిలో గెలిచారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement