ఇంగ్లండ్‌ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా? | New Zealand Set Target of 242 Runs Against England In Summit Clash | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా?

Jul 14 2019 7:24 PM | Updated on Jul 14 2019 7:37 PM

New Zealand Set Target of 242 Runs Against England In Summit Clash - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా  ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తుది పోరులో న్యూజిలాండ్‌ 242 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  హెన్రీ నికోలస్‌(55; 77 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించగా, టామ్‌ లాథమ్‌(47; 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌(30; 53 బంతుల్లో 2 ఫోర్లు) కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా వారు విఫలమయ్యారు.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ గప్టిల్‌(19) మరోసారి నిరాశపరిచాడు.  ఆ తరుణంలో నికోలస్‌తో కెప్టెన్‌ విలియమ్సన్‌ జత కలిశాడు. వీరిద్దరూ 74 పరుగులు సాధించిన తర్వాత విలియమ్సన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ప్లంకెట్‌ బౌలింగ్‌లో కీపర్‌ జోస్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. (ఇక్కడ చదవండి: కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు)

దాంతో 103 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో నికోలస్‌ మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, రాస్‌ టేలర్‌(15) విఫలమయ్యాడు. కాగా, లాథమ్‌ ఆదుకోవడంతో కివీస్‌ గాడిలో పడింది. ఈ క్రమంలోనే నీషమ్‌తో కలిసి 32 పరుగులు జత చేసిన లాథమ్‌.. గ్రాండ్‌ హోమ్‌తో కలిసి 46 పరుగులు భాగస్వామ్యం సాధించాడు. కాగా, 48.3 ఓవర్లలో కివీస్‌ స్కోరు 232 పరుగుల వద్ద లాథమ్‌ ఏడో వికెట్‌గా ఔట్‌ కాగా, ఆ తర్వాత 9 పరుగుల్ని మాత్రమే వచ్చాయి. దాంతో  కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.  ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌, ప్లంకెట్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌లు చెరో వికెట్‌ తీశారు. మరి కివీస్‌ నిర్దేశించిన సాధారణ టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ఛేదిస్తుందా.. లేక చతికిలబడుతుందా అనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement