బై బై ‘బ్లాక్ మంబా’ | NBA legend Bryant retired | Sakshi
Sakshi News home page

బై బై ‘బ్లాక్ మంబా’

Apr 15 2016 8:40 AM | Updated on Sep 3 2017 9:55 PM

బై బై ‘బ్లాక్ మంబా’

బై బై ‘బ్లాక్ మంబా’

నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) స్టార్ ఆటగాడు కోబ్ బ్రయాంట్ తన రెండు దశాబ్దాల అద్భుత కెరీర్‌కు.....

లాస్ ఏంజిల్స్: నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) స్టార్ ఆటగాడు కోబ్ బ్రయాంట్ తన రెండు దశాబ్దాల అద్భుత కెరీర్‌కు ముగింపు పలికాడు. తన కెరీర్ ఆద్యంతం లాస్ ఏంజిల్స్ లేకర్స్ జట్టుకే ఆడిన 37 ఏళ్ల కోబ్ తన అసమాన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాడు. బుధవారం రాత్రి స్టేపుల్స్ సెంటర్స్‌లో ఉతా జాజ్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లోనూ సత్తా చూపిస్తూ ఏకంగా 60 పాయింట్లు సాధించాడు. ఇది ఏ ఆటగాడి చివరి మ్యాచ్‌లోనైనా రికార్డు స్కోరు.

దీంతో లేకర్స్ 101-96 తేడాతో నెగ్గింది. బ్లాక్ మంబా అనే ముద్దుపేరుతో పిలుచుకునే ఈ స్టార్ చివరి ఆటను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బాస్కెట్‌బాల్ చరిత్రలోనే జత టిక్కెట్లకు అత్యధిక రేటు (రూ.18 లక్షల 30 వేలు) పలికింది. మరోవైపు హాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఇతర క్రీడా దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement