జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీ రేపటి నుంచి | national level basket ball tourny starts tomorrow | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీ రేపటి నుంచి

Sep 30 2016 10:36 AM | Updated on Sep 4 2017 3:39 PM

అరైస్ స్టీల్ జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభం కానుంది.

సాక్షి, హైదరాబాద్: అరైస్ స్టీల్ జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభం కానుంది. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 7 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో అండర్-13 బాలబాలికల విభాగంలో పోటీలు నిర్వహిస్తారు. శనివారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి, శాట్స్ ఎండీ దినకర్‌బాబు పాల్గొననున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. 13 ఏళ్ల తర్వాత జాతీయ స్థారుు బాస్కెట్‌బాల్ టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. మధ్య ప్రదేశ్ బాలుర జట్టు, ఛత్తీస్‌గఢ్ బాలికల జట్టు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement