వింబుల్డన్ విజేత జొకోవిచ్

వింబుల్డన్ విజేత జొకోవిచ్


లండన్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో జొకోవిచ్ 7-6(7-1),6-7(10-12), 6-4, 6-3 తేడాతో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ను బోల్తాకొట్టించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. దీంతో 9 వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్న జొకోవిచ్.. ముచ్చటగా మూడోసారి వింబుల్డన్ టైటిల్ ను గెలుచుకున్నాడు.





కాగా, 18 వ గ్రాండ్ స్లామ్ సాధించాలన్నఫెదరర్ ఆశ నెరవేరలేదు.  తొలిసెట్ లో ఫెదరర్ ముందంజలో పయనించినట్లు కనిపించినా.. ఆ సెట్ టై బ్రేక్ కు దారి తీసింది. ఆ సమయంలో జొకోవిచ్ రెచ్చిపోయాడు. టై బ్రేక్ లో ఫెదరర్ కు ఒక్క పాయింట్ మాత్రమే చేజార్చుకున్న జొకోవిచ్ ఆ సెట్ ను వశ పరుచుకున్నాడు. ఇక రెండో సెట్ వచ్చేసరికి వీరిద్దరి మధ్య పోరు యుద్ధ వాతావారణాన్ని తలపించింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన రెండో సెట్ కూడా ట్రై బ్రేక్ వెళ్లింది. అయితే ఇక్కడ మాత్రం ఫెదరర్ ఆ సెట్ ను దక్కించుకుని స్కోరు సమం చేశాడు. కీలకమైన మూడో సెట్ లో జొకోవిచ్ పైచేయి సాధించి ఆధిక్యం దిశగా దూసుకుపోయాడు. తర్వాత జొకోవిచ్ కు ఎదురులేకుండా పోయింది. నిర్ణయాత్మ నాల్గో సెట్ లో జొకోవిచ్ దూకుడుగా ఆడి ఫెదరర్ ను మట్టికరిపించాడు.


 


నొవాక్ జొకోవిచ్ ప్రొఫైల్..



జన్మదినం: 1987 మే 22

దేశం: సెర్బియా

కెరీర్ సింగిల్స్ టైటిల్స్: 53

ప్రస్తుత ర్యాంక్ 1

గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ 9



ఆస్ట్రేలియా ఓపెన్ 5

వింబుల్డన్ 3

యూఎస్ ఓపెన్ 1

ఒలింపిక్ గేమ్స్

2008లో కాంస్యం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top