
64 ఏళ్ల తర్వాత...
ఏఎఫ్‌సీ ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌లో భారత్ 1–0తో మయన్మార్‌పై విజయం సాధించింది. సునీల్ చెత్రి చివరి నిమిషంలో గోల్ చేసి జట్టును గెలిపించాడు.
యాంగాన్ (మయన్మార్): ఏఎఫ్‌సీ ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌లో భారత్ 1–0తో మయన్మార్‌పై విజయం సాధించింది. సునీల్ చెత్రి చివరి నిమిషంలో గోల్ చేసి జట్టును గెలిపించాడు. ఆట 90వ నిమిషంలో ఉదాంత సింగ్ అందించిన పాస్‌ను చెత్రి నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపి భారత శిబిరంలో సంతోషం నింపాడు. దీంతో భారత ఫుట్‌బాల్ జట్టు 64 ఏళ్ల తర్వాత మయన్మార్ గడ్డపై విజయం సాధించింది.
1953లో రంగూన్ (ఇప్పుడు యాంగాన్‌గా మార్చారు)లో జరిగిన నాలుగు దేశాల ఫుట్‌బాల్ టోర్నీలో భారత్ 4–2తో మయన్మార్‌ను ఓడించింది. ఆ తర్వాత 2013లో ఆడినా... భారత్‌కు 0–1తో ఓటమి ఎదురైంది. తదుపరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో భారత్ కిర్గిస్తాన్‌తో తలపడనుంది. మకావూలో జూన్ 13న ఈ పోరు జరుగనుంది.