కోల్కతా లక్ష్యం 172 | mumbai set 172 runs target to kolkatha | Sakshi
Sakshi News home page

కోల్కతా లక్ష్యం 172

May 14 2015 9:44 PM | Updated on Sep 3 2017 2:02 AM

కోల్కతా లక్ష్యం 172

కోల్కతా లక్ష్యం 172

ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పాండ్యా(61) మెరుపు ఇన్నింగ్స్ కు తోడు పోలార్డ్(33) సహకారంతో ముంబై, కోల్ కతా ఎదుట 172 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ముంబై బ్యాటింగ్కు దిగింది. జట్టు 29 పరుగుల వద్ద ఓపెనర్గా వచ్చిన పార్థీవ్ పటేల్(21) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత సిమ్మన్స్ (14), అంబటి రాయుడు (2) వెంటవెంటనే అవుటయ్యారు. నిలకడగా పరుగులు రాబడుతున్న సమయంలోనే రోహిత్ శర్మ(30) నరైన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వత క్రీజ్లోకొచ్చిన పోలార్డ్,పాండ్యాలు మొదట్లో నిదానంగా ఆడి చివర్లో మెరుపులు మెరిపించారు.యాదవ్ వేసిన 17 వ ఓవర్లో పాండ్యా వరుసగా నాలుగు బౌండరీలు బాది ఏకంగా 18 పరుగులు, రస్సెల్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ బాది 17 పరుగుల రాబట్టాడు..దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171  పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement