హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముంబై: ఐపీఎల్-10లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. మోయిసెస్ స్థానంలో ముస్తఫిజుర్ రహ్మాన్ టీమ్‌లోకి వచ్చాడు. విజయ్ శంకర్ ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. బిఫుల్ శర్మ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నారు.