ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ముంబై ఎఫ్‌సీ సిటీ జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసింది.
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ముంబై ఎఫ్‌సీ సిటీ జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసింది. చెన్నైరుున్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌ను ముంబై జట్టు 1-1తో సమంగా ముగించింది. ఆట 51వ నిమిషంలో లాల్‌పెకులా గోల్‌తో చెన్నైరుున్ జట్టు 1-0తో ముందంజ వేసింది. ముంబై జట్టు స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.
ఇక చెన్నైరుున్ జట్టుదే విజయం అనుకుంటున్న తరుణంలో.. మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ముంబై ఆటగాడు లియో కోస్టా అద్భుత గోల్ చేసి స్కో రును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌లో పుణేతో గోవా జట్టు తలపడుతుంది.