breaking news
Mumbai FC City team
-
ఐఎస్ఎల్ 1000వ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చరిత్రలో 1000వ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జరిగిన పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. ముంబై జట్టు తరఫున నాథన్ రోడ్రిగ్స్ (63వ నిమిషంలో) ఒక గోల్ సాధించగా... చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున కెప్టెన్ ర్యాన్ ఎడ్వర్డ్స్ (60వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఇరు జట్లు చెరో 14 షాట్లు ఆడగా... అందులో ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగేసి సార్లు దాడులు చేశాయి. ముంబై జట్టు చిన్న చిన్న పాస్‌లతో ముందుకు సాగగా... చెన్నైయన్జట్టు 15 ఫౌల్స్ చేసింది. ఈ ఫలితంతో 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకున్న చెన్నైయన్ జట్టు 12 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానానికి చేరగా... 10 పాయింట్లు ఖాతాలో ఉన్న ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది.ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌తో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. -
ముంబైని ఆదుకున్న కోస్టా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ముంబై ఎఫ్‌సీ సిటీ జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసింది. చెన్నైరుున్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌ను ముంబై జట్టు 1-1తో సమంగా ముగించింది. ఆట 51వ నిమిషంలో లాల్‌పెకులా గోల్‌తో చెన్నైరుున్ జట్టు 1-0తో ముందంజ వేసింది. ముంబై జట్టు స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఇక చెన్నైరుున్ జట్టుదే విజయం అనుకుంటున్న తరుణంలో.. మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ముంబై ఆటగాడు లియో కోస్టా అద్భుత గోల్ చేసి స్కో రును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌లో పుణేతో గోవా జట్టు తలపడుతుంది.