ఇక కోచ్‌గా అజహర్ | Mohammad Azharuddin agrees to coach Jammu and Kashmir cricket team | Sakshi
Sakshi News home page

ఇక కోచ్‌గా అజహర్

Aug 24 2013 2:00 AM | Updated on Mar 9 2019 3:08 PM

ఇక కోచ్‌గా అజహర్ - Sakshi

ఇక కోచ్‌గా అజహర్

సుదీర్ఘ చర్చల తర్వాత జమ్మూ కాశ్మీర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు భారత మాజీ కెప్టెన్, లోక్‌సభ సభ్యుడు అజహరుద్దీన్ అంగీకరించారు. ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు ఫరూఖ్ అబ్దుల్లా చాలాకాలం నుంచి అజహర్‌తో చర్చలు జరుపుతున్నారు.

న్యూఢిల్లీ: సుదీర్ఘ చర్చల తర్వాత జమ్మూ కాశ్మీర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు భారత మాజీ కెప్టెన్, లోక్‌సభ సభ్యుడు అజహరుద్దీన్ అంగీకరించారు. ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు ఫరూఖ్ అబ్దుల్లా చాలాకాలం నుంచి అజహర్‌తో చర్చలు జరుపుతున్నారు. ఎట్టకేలకు శుక్రవారం ఈ హైదరాబాదీ స్టార్ తన అంగీకారం తెలిపారు.
 
 ‘మా రాష్ట్ర క్రికెట్ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఎట్టకేలకు అజహర్ అంగీకరించారు. మా యువ క్రికెటర్లకు ఆయన అనుభవం ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం’ అని అబ్దుల్లా తెలిపారు. అయితే దీనికి ఇంకా బీసీసీఐ నుంచి మాత్రం గ్రీన్‌సిగ్నల్ రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement