షుమాకర్‌కు మాట పడిపోయింది! | Michael Schumacher 'paralysed' and has 'memory, speech problems' | Sakshi
Sakshi News home page

షుమాకర్‌కు మాట పడిపోయింది!

Nov 20 2014 9:35 AM | Updated on Aug 1 2018 4:17 PM

షుమాకర్‌కు మాట పడిపోయింది! - Sakshi

షుమాకర్‌కు మాట పడిపోయింది!

స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై 11 నెలలు కావస్తున్నా ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య స్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు.

లుసానే: స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై 11 నెలలు కావస్తున్నా ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య స్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. తాజాగా అతనికి పక్షవాతం సోకి పూర్తిగా చక్రాల కుర్చీకే అంకితమైనట్లు తెలిసింది. షుమీని కలిసిన అనంతరం షుమాకర్ మిత్రుడు, ఎఫ్1 మాజీ డ్రైవర్ ఫిలిప్ స్ట్రిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గతం కంటే కాస్త బాగున్నట్లు అనిపించింది. అయితే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది.

 

అతను వీల్‌చైర్‌లోనే ఉంటున్నాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. పైగా జ్ఞాపక శక్తి సమస్య కూడా వెంటాడుతోంది. సైగలతోనే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా అర్థం కావడం లేదు’ అని ఫిలిప్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement