'వారిపై జీవితకాల నిషేధం విధించాలి' | Maradona calls Infantino a traitor, asks for life imprisonment for Blatter, Platini | Sakshi
Sakshi News home page

'వారిపై జీవితకాల నిషేధం విధించాలి'

Feb 27 2016 6:19 PM | Updated on Jun 15 2018 4:33 PM

'వారిపై జీవితకాల నిషేధం విధించాలి' - Sakshi

'వారిపై జీవితకాల నిషేధం విధించాలి'

అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో వెలుగుచూసిన అవినీతి కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించిన మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై అర్జెంటీనా మాజీ ఫుట్ బాల్ కెప్టెన్ డిగో మారడోనా మండిపడ్డాడు.

లండన్: అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో సంచలనం సృష్టించిన భారీ అవినీతిలో కీలకపాత్ర పోషించిన మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై అర్జెంటీనా మాజీ ఫుట్ బాల్ కెప్టెన్ డిగో మారడోనా మండిపడ్డాడు. అసలు బ్లాటర్ పై జీవితకాల నిషేధం వేయకుండా అతని నిషేధ సమయాన్ని ఆరు సంవత్సరాలకు తగ్గించి తప్పుచేశారన్నాడు. బ్లాటర్తో పాటు ఫుట్ బాల్ కు మచ్చతెచ్చిన యూరోపియన్ సాకర్ చీఫ్ ప్లాటినిని కూడా తన జీవిత కాలంలో ఫిఫా వైపు చూడకుండా చేయాలని సూచించాడు. 

 

వీరిద్దరి నిషేధాన్ని ఎనిమిది నుంచి ఆరేళ్లకు తగ్గించిన ఫిఫా ఎథిక్స్ కమిటీ తీరును సైతం తప్పుపట్టాడు. ఎథిక్స్ కమిటీ చేసింది సరైన చర్యగా కనబడటం లేదన్నాడు. దీంతో పాటు తాజాగా ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన ఇన్ఫెంటినోపై కూడా మారడోనా విమర్శలు గుప్పించాడు.  అతనొక విశ్వాసఘాతకుడు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement