ప్రిక్వార్టర్స్‌లో మనోజ్, కవీందర్‌ | Manoj, Kavinder in the prequelers | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో మనోజ్, కవీందర్‌

Aug 28 2017 1:32 AM | Updated on Sep 17 2017 6:01 PM

ప్రిక్వార్టర్స్‌లో మనోజ్, కవీందర్‌

ప్రిక్వార్టర్స్‌లో మనోజ్, కవీందర్‌

ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మనోజ్‌ కుమార్‌ (69 కేజీ లు), కవీందర్‌ బిష్త్‌ (52 కేజీలు) శుభారంభం చేయగా.

ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌
హాంబర్గ్‌ (జర్మనీ):
ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మనోజ్‌ కుమార్‌ (69 కేజీ లు), కవీందర్‌ బిష్త్‌ (52 కేజీలు) శుభారంభం చేయగా... సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. తొలిరౌండ్‌లో మనోజ్‌ 3–2తో వాసిలి బెలూస్‌ (మాల్దోవా)పై, కవీందర్‌ 3–2తో రుసె బాబా (జపాన్‌)పై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. సతీశ్‌ 0–5తో మజిదోవ్‌ (అజర్‌బైజాన్‌) చేతిలో ఓడిపోయాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మొహమ్మద్‌ ఫ్లిసి (అల్జీరియా)తో కవీందర్‌;   పెరెజ్‌ (వెనిజులా)తో మనోజ్‌ తలపడతారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement