దేశం కోసం మలింగ ఆడాలి

Malinga makes Sri Lanka World Cup squad - Sakshi

శ్రీలంక క్రికెట్‌ చీఫ్‌ షమ్మీ సిల్వా వ్యాఖ్య

ప్రపంచకప్‌ జట్టు ప్రకటన

కొలొంబో: ప్రపంచకప్‌నకు ముందు వన్డే జట్టు సారథ్యాన్ని దిముత్‌ కరుణరత్నెకు కోల్పోయిన పేసర్‌ లసిత్‌ మలింగ... నిరాశను పక్కనపెట్టి దేశం కోసం ఆడాలని శ్రీలంక క్రికెట్‌ చీఫ్‌ షమ్మీ సిల్వా కోరారు. గురువారం శ్రీలంక క్రికెట్‌ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్‌ జట్టును ప్రకటించింది. ఈ జట్టులోకి మలింగను పేసర్‌గా ఎంపిక చేసిన సెలెక్టర్లు వ్యక్తిగతంగా రాణిస్తున్న మలింగ... కెప్టెన్సీలో అంచనాలను అందుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లంక సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అషంత డి మెల్‌ మాట్లాడుతూ అసలే అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న లంక క్రికెట్‌ను రక్షించుకోవాలంటే ఆటగాళ్లంతా ఏకమై దేశం కోసం ఆడాలని ఆకాంక్షించారు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో చివరిసారిగా వన్డే ఆడిన జీవన్‌ మెండిస్‌తో పాటు గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న మిలింద సిరివర్దెన, జెఫ్రీ వండెర్‌సీ ప్రపంచకప్‌తో పునరాగమనం చేయనున్నారు.   

శ్రీలంక ప్రపంచ కప్‌ జట్టు: దిముత్‌ కరుణరత్నె (కెప్టెన్‌), లసిత్‌ మలింగ, ఏంజెలో మాథ్యూస్, తిసారా పెరీరా, కుషాల్‌ జనిత్‌ పెరీరా, ధనంజయ డి సిల్వా, కుషాల్‌ మెండిస్, ఇసురు ఉదాన, మిలింద సిరివర్దెన, అవిష్క ఫెర్నాండో, జీవన్‌ మెండిస్, లహిరు తిరిమన్నె, జెఫ్రీ వండెర్‌సీ, నువాన్‌ ప్రదీప్, సురంగ లక్మల్‌.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top