లసిత్‌ మలింగా పునరాగమనం

Lasith Malinga recalled for Asia Cup - Sakshi

కొలంబో: దాదాపు ఏడాది కాలంగా శ్రీలంక క్రికెట్‌ జట్టుకు దూరమైన సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగా పునరాగమనం చేయబోతున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భాగంగా ప్రకటించిన శ్రీలంక జట్టులో మలింగా చోటు కల్పించారు. ఈ మేరకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం లంక సెలక్టర్లు ప్రకటించారు.  

2017‌లో భారత్‌పై చివరిసారిగా మలింగ తన వన్డే మ్యాచ్‌‌ని ఆడాడు. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ‌లో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రీడల మంత్రి పెదవి విరిచారు. ఆటగాళ్లకి కనీస ఫిట్‌నెస్ ప్రమాణాలు కూడా లేవని ఆ సమయంలో మంత్రి విమర్శించడంతో లసిత్ మలింగ క్రీడల మంత్రిపై వ్యంగ్యంగా స్పందించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే శ్రీలంక జట్టులో చోటు కోల్పోయాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో కూడా ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.

దీంతో మలింగ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా అతడిని ఆసియా కప్ కోసం ప్రకటించిన వన్డే జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆసియా కప్‌లో శ్రీలంక జట్టుకి ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top