ఎల్.వెంకట్రామిరెడ్డి (భాయ్ సాబ్) ఇక లేరు | L venkatarami reddy is no more | Sakshi
Sakshi News home page

ఎల్.వెంకట్రామిరెడ్డి (భాయ్ సాబ్) ఇక లేరు

Jan 3 2014 7:56 PM | Updated on Mar 23 2019 9:06 PM

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఎల్. వెంకట్రామిరెడ్డి (88) కన్నుమూశారు.

హైదరాబాద్: ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఎల్. వెంకట్రామిరెడ్డి (88) శుక్రవారం కన్నుమూశారు. ఏపీ వాలీబాల్ అసోసియేషన్కు వెంకట్రామిరెడ్డి కార్యదర్శిగా చేశారు. అంతేకాకుండా ఆలిండియా వాలీబాల్ అసోసియేషన్కు టెక్నికల్ డైరెక్టర్గా ఎల్. వెంకట్రామిరెడ్డి పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు  ఉన్నారు. రేపు ఉదయం 10 నుంచి 11గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఒలింపిక్ భవన్లో ఆయన భౌతికకాయాన్ని ఉంచునున్నారు.

ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విదేశాల్లో ఉన్నఓ కొడుకు ఉన్నాడు. రాష్ట్రంలో  దాదాపు యాభై పైగా క్రీడా సంఘాలను నెలకొల్పడటంలో ఆయన కీలక పాత్ర వహించాడు. రాష్ట్ర క్రీడాకారులందరూ వెంకట్రామిరెడ్డిని భాయ్ సాబ్ గా  ప్రేమతో పిలుస్తారు. స్వయంగా వాలీబాల్ క్రీడాకారుడైన వెంకట్రామిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్ఎ ఉర్దూ పట్ట బద్రులైయ్యారు.

ఉస్మానియా  తరపున కెప్టెన్గా ఆల్ ఇండియా ఇంటర్వర్శిటీ వాలీబాల్ టొర్నమెంట్-లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ జట్టుకు దాదాపు పదేళ్లు ప్రతినిధ్యం  వహించాడు. భారత వాలీబాల్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. 20ఏళ్ల పైగా రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఏక చత్రాధిపత్యం వహించి రాష్ట్రంలో వాలీబాల్ క్రీడాభివృద్ధికి అంకితభావంతో పనిచేశాడు. వాలీబాల్ క్రీడాకారులను సొంత కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా ప్రేమతో చూసేవారు. యమ్సీహెచ్ క్రీడాధికారిగా పదవి చేపట్టిన ఎల్.వెంకట్రామిరెడ్డి (ఎల్ఆర్ రెడ్డి), డైరెక్టర్గా రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లు ఆ పదవిలో నియమించడం విశేషం. జీహెచ్ఎమ్సీలో 40మంది కోచ్లను నియమించి పటిష్టమైన  క్రీడావిభాగాన్ని నెలకొల్పడంతోపాటు ప్రతి ఏడాది సమ్మర్లో పలు క్రీడాంశాల్లో వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసి జంట నగరాల్లోని చిన్నారి  బాలబాలికలను క్రీడాభిముఖులను చేయడం ఆయన సేవలు ప్రశంసనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement