breaking news
Bhai sab
-
దాహం.. దాహం..
భైంసా, న్యూస్‌లైన్ : కుంటాల మండలం దౌనెల్లితండా ప్రజలు 50 ఏళ్లుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఊట నీళ్ల కోసం రోజూ తండావాసులు గుడారం వేసుకుని నిరీక్షిస్తున్నారు. నీటి పథకం నిర్మా ణం కోసం రూ.18 లక్షలు మంజూరై నా ఇప్పటి వరకు పనులు ప్రారంభిం చలేదు. దీంతో తం డావాసుల తాగునీటి సమస్య పరిష్కారం కాలే దు. అంబుగాం, బూర్గుపెల్లి(జి), సూర్యంతండాల్లోనూ నీటి ఇబ్బందులు స్థానికులను వెంటాడుతున్నాయి. కాలినడకన... గోదావరి నదికి పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో బిద్రె ల్లి గ్రామం ఉంది. ముథోల్ మండలంలోని ఈ గ్రామంలో గత పదేళ్లుగా తాగునీటి కోసం స్థానికులు తల్లడిల్లుతున్నారు. ఏటా పాలకులు నీటి సమస్య పరిష్కారానికి హామీలు ఇస్తున్నారే తప్ప చేతల్లో చూపడంలేదు. దీంతో కిలోమీటరు మేర కాలినడకన వెళ్లి బిద్రెల్లివాసులు బాసర నుంచి వచ్చే నీటి పైపుల నుంచి తాగునీటిని తీసుకెళ్తున్నారు. బిద్రెల్లివాసుల కష్టాలు అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ముథోల్ మండలం ముద్గల్, విఠోలితండా, కిర్గుల్ గ్రామాల్లోనూ తాగునీటి ఇబ్బందులున్నాయి. ముథోల్‌లోని బ్రహ్మణగల్లీలోనూ తాగునీటి సమస్య ఉంది. వాగు నీరే దిక్కు.. తానూరు మండలం ఝరి(బి) గ్రామస్తులైతే తాగునీటి కోసం పక్కనే ఉన్న వాగును ఆశ్రయిస్తున్నారు. కాలినడకన వాగుకు వెళ్లి బిందెల్లో నీళ్లు పట్టుకొచ్చుకుంటూ ఆ నీటినే తాగుతున్నారు. అయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. హిప్నెల్లితండా, ఝరితండా, ఏల్వీ, బామ్నితండా, ఎల్వత్ గ్రామస్తులూ తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ వేసవిలోనూ నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అధికారులు చెబుతున్న మాటలు నీటిమూటలే అవుతున్నాయి. ఎడ్లబండ్లలో.. భైంసా పట్టణ సమీపంలో నిర్మించిన గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు వచ్చే నీరంతా నిగ్వా సమీపంలోని వాగు నుంచే చేరుతుంది. మహారాష్ట్ర నుంచి వచ్చే నీరంతా సరిహద్దు గ్రామమైన నిగ్వా వాగులో కలుస్తుంది. అయినా కుభీర్ మండలం నిగ్వా గ్రామస్తులు 16 ఏళ్లుగా నీటి కష్టాలు అనుభవిస్తున్నారు. గ్రామస్తులంతా ఎడ్లబండ్లను తీసుకువచ్చి పాఠశాల సమీపం నుంచే నీటిని డ్రమ్ముల్లో తీసుకెళ్తున్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు పట్టణవాసుల దాహార్తి తీరుస్తున్నా నిగ్వా గ్రామస్తుల ఇబ్బందులు తీర్చలేకపోతోంది. తాగునీటి పథకాలు ఉన్నా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదు. అంతర్ని, రంగశివుని, డొడర్నతండా వాసులూ నీటి కష్టాలు పడుతున్నారు. ప్రాజెక్టు పూర్తయితేనే.... రంగారావుపల్సికర్ ప్రాజెక్టు పూర్తయితే సాగునీరు అందకపోయినా తాగునీటి కష్టాలైనా తీరుతాయని స్థానికులు ఆశిం చారు. భైంసా మండలం వాడి గ్రామం వద్ద చేపట్టిన ఈ ప్రా జెక్టు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే వాడి, బాబుల్‌గాం, కోతల్గాం, ఎగ్గాం గ్రామాల నీటి కష్టాలు తొలగుతాయి. ప్రస్తుతం ఈ గ్రామాల్లో నీటి స మస్య తీవ్రంగా ఉంది. మహాగాం గ్రామంలోని బీసీ కాలనీ, వాలేగాం, కుంసర గుట్ట ప్రాంతం, మాంజ్రి గ్రామంలో నీటి ఇబ్బందులు ఉన్నాయి. భైంసా మండలం ఖథ్గాం గ్రామం లో ఒకే బోరు స్థానికుల దాహార్తి తీరుస్తోంది. కరెంటు ఉంటేనే... లోకేశ్వరం మండలంలో కరెంటు ఉంటేనే తాగునీరు. త్రీఫేస్ కరెంటు రాదని తెలిసి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులే చాలా గ్రామాల్లో నీటి పథకాలకు సింగిల్ ఫేస్ మోటార్లు బిగించారు. ఈ మోటార్లే ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. పొట్పెల్లి, రాయపూర్‌కాండ్లి గ్రామాల్లో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఎల్.వెంకట్రామిరెడ్డి (భాయ్ సాబ్) ఇక లేరు
హైదరాబాద్: ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఎల్. వెంకట్రామిరెడ్డి (88) శుక్రవారం కన్నుమూశారు. ఏపీ వాలీబాల్ అసోసియేషన్‌కు వెంకట్రామిరెడ్డి కార్యదర్శిగా చేశారు. అంతేకాకుండా ఆలిండియా వాలీబాల్ అసోసియేషన్‌కు టెక్నికల్ డైరెక్టర్‌గా ఎల్. వెంకట్రామిరెడ్డి పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రేపు ఉదయం 10 నుంచి 11గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఒలింపిక్ భవన్లో ఆయన భౌతికకాయాన్ని ఉంచునున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విదేశాల్లో ఉన్నఓ కొడుకు ఉన్నాడు. రాష్ట్రంలో దాదాపు యాభై పైగా క్రీడా సంఘాలను నెలకొల్పడటంలో ఆయన కీలక పాత్ర వహించాడు. రాష్ట్ర క్రీడాకారులందరూ వెంకట్రామిరెడ్డిని భాయ్ సాబ్ గా ప్రేమతో పిలుస్తారు. స్వయంగా వాలీబాల్ క్రీడాకారుడైన వెంకట్రామిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్ఎ ఉర్దూ పట్ట బద్రులైయ్యారు. ఉస్మానియా తరపున కెప్టెన్‌గా ఆల్ ఇండియా ఇంటర్వర్శిటీ వాలీబాల్ టొర్నమెంట్-లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ జట్టుకు దాదాపు పదేళ్లు ప్రతినిధ్యం వహించాడు. భారత వాలీబాల్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. 20ఏళ్ల పైగా రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఏక చత్రాధిపత్యం వహించి రాష్ట్రంలో వాలీబాల్ క్రీడాభివృద్ధికి అంకితభావంతో పనిచేశాడు. వాలీబాల్ క్రీడాకారులను సొంత కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా ప్రేమతో చూసేవారు. యమ్సీహెచ్ క్రీడాధికారిగా పదవి చేపట్టిన ఎల్.వెంకట్రామిరెడ్డి (ఎల్ఆర్ రెడ్డి), డైరెక్టర్‌గా రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లు ఆ పదవిలో నియమించడం విశేషం. జీహెచ్ఎమ్సీలో 40మంది కోచ్‌లను నియమించి పటిష్టమైన క్రీడావిభాగాన్ని నెలకొల్పడంతోపాటు ప్రతి ఏడాది సమ్మర్లో పలు క్రీడాంశాల్లో వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసి జంట నగరాల్లోని చిన్నారి బాలబాలికలను క్రీడాభిముఖులను చేయడం ఆయన సేవలు ప్రశంసనీయం.