కోల్కతా టార్గెట్ 200 | kolkatha target 200 | Sakshi
Sakshi News home page

కోల్కతా టార్గెట్ 200

May 16 2015 9:48 PM | Updated on Sep 3 2017 2:10 AM

కోల్కతా టార్గెట్ 200

కోల్కతా టార్గెట్ 200

ఐపీఎల్-8లో భాగంగా శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఎదుట రాజస్థాన్ 200పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ముంబై: ఐపీఎల్-8లో భాగంగా శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఎదుట రాజస్థాన్ 200పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన రహానే(37), వాట్సన్(104)లు తొలి నుంచి ధాటిగా ఆడి రాజస్థాన్కి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కి 80 పరుగుల భాగస్వామ్యన్ని జోడించారు.

వేగంగా పరుగులు రాబడుతున్న సమయంలోనే రహానే(37) రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్(14) పరుగుల వద్ద రస్సెల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సామ్సన్(8) , ఫాల్క్నర్(6), కరుణ్(16) మోరీస్(4) పరుగులు చేసి ఔటయ్యారు.  వాట్సన్(104)మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్ గా నిలిచారు. బౌలింగ్లోరస్సెల్ రాణించి మూడు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్కు ఒక వికెట్ లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement