Kolkata Police Interrogated to Shami about Domestic violence on Hasin Jahan - Sakshi
Sakshi News home page

షమీని విచారించిన కోల్‌కతా పోలీసులు

Apr 19 2018 2:34 AM | Updated on Apr 19 2018 11:35 AM

Kolkata police interrogation samini - Sakshi

భారత క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీని కోల్‌కతా పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. అతని భార్య హసీన్‌ జహాన్‌ ఈ పేస్‌ బౌలర్‌పై గృహహింస తదితర కేసులు పెట్టింది. దీనిపై కోర్టు అతనికి సమన్లు జారీ చేయగా...షమీ బుధవారం పోలీసుల ఎదుట హాజరయ్యాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీకి ఆడుతున్న అతను 16న ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ ముగిశాక జట్టుతో పాటు బెంగళూరు (తదుపరి మ్యాచ్‌ వేదిక)కు బయల్దేరలేదు.విచారణ నిమిత్తం అక్కడే ఉన్నాడు. విచారణకు షమీ సహకరించాడని, అతను తిరిగి జట్టుతో కలిసేందుకు అనుమతించినట్లు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్రైమ్‌) ప్రవీణ్‌ త్రిపాఠి చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement