
సీపీఎం కీలక నేతలు సహా 54 మందిపై ఛార్జిషీట్
సియల్డా కోర్టులో దాఖలు చేసిన కోల్‌కతా పోలీసులు
కోర్టులో లొంగిపోయి బెయిల్ పొందిన నిందితులు
కోల్‌కతా: 2024 ఆగస్ట్ 14వ తేదీ రాత్రి కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వామపక్ష నేతలే కారణమని కోల్‌కతా పోలీసులు ఆరోపిస్తున్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మీనాక్షీ ముఖర్జీ సహా 54 మంది పేర్లతో కూడిన నివేదికను సియల్డా కోర్టుకు సమర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతలు దేబాంజన్ దేవ్, కలతన్ దాస్‌గుప్తా, సీపీఎంఎల్ మాజీ నేత దిధితి రాయ్, సీపీఎం నేత దీపూ దాస్ పేర్లు కూడా చార్జిషీటులో ఉన్నాయి.
ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో పనిచేసే ట్రెయినీ వైద్యురాలు ఆగస్ట్ 9వ తేదీన దారుణ హత్యాచారానికి గురయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిపై దాడి జరిగింది. ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో విధ్వంసం సృష్టించారు. అడ్డుకోబోయిన పలువురు వైద్యాధికారులతోపాటు పోలీసులు సైతం గాయపడ్డారు. దీనికి సంబంధించి కోల్‌కతా పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని, కాల్ డేటా రికార్డులను పరిశీలించడంతోపాటు ప్రత్యక్ష సాకు‡్ష్యలు, బాధితులను వందలాది మందిని ప్రశ్నించారు. మీనాక్షీ ముఖర్జీని కూడా ప్రశ్నించారు. వీరంతా కోల్‌కతాలోని ఓ సీపీఎం నేత ఇంట్లో సమావేశమై ధ్వంస రచన చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. చార్జిషీటును పరిశీలించిన సియల్డా కోర్టు మేజి్రస్టేట్ సోమవారం మీనాక్షీ ముఖర్జీ సహా పలువురికి సమన్లు జారీ చేశారు. వీరంతా కోర్టు ఎదుట లొంగిపోయారు. కోర్టు వీరికి ఈ కేసులో బెయిల్ మంజూరు చేసింది.