పెప్సీకి కోహ్లి గుడ్‌బై! | Kohli Goodbye to Pepsi | Sakshi
Sakshi News home page

పెప్సీకి కోహ్లి గుడ్‌బై!

Jun 6 2017 1:08 AM | Updated on Sep 5 2017 12:53 PM

పెప్సీకి కోహ్లి గుడ్‌బై!

పెప్సీకి కోహ్లి గుడ్‌బై!

విరాట్‌ కోహ్లి మారిపోయాడు... ప్రస్తుతం 18 ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అతను, ...

తాను తాగకపోవడమే కారణం   

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లి మారిపోయాడు... ప్రస్తుతం 18 ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అతను, ఇకపై తాను వాడే, తనకు నచ్చిన వాటికే అంబాసిడర్‌గా ఉంటా నన్నాడు. అందులో భాగంగా పెప్సీతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోరాదని నిర్ణయించుకున్నాడు. గత ఆరేళ్లుగా పెప్సీ కూల్‌ డ్రింక్‌తో కోహ్లికి అనుబంధం ఉంది. నేరుగా పెప్సీ అని పేరు చెప్పకపోయినా, ఈ సంస్థతో కాంట్రాక్ట్‌ పొడిగించుకోవద్దని తీసుకున్న నిర్ణయం అతని ఆలోచనలను చూపించింది.

‘కొన్నాళ్లుగా నా ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి పెట్టాను. దానికి ఇబ్బంది కలిగించే వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పేర్లు చెప్పను కానీ కొన్ని ఉత్పత్తులను నేను వాడటం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్‌ చేస్తూ వాడమని అభిమానులకు చెప్పలేను’ అని ఇటీవల కోహ్లి వ్యాఖ్యానించాడు. అయితే కూల్‌ డ్రింక్‌ కాకుండా పెప్సికో కంపెనీకి సంబంధించిన హెల్త్‌ బ్రాండ్‌ కోసం కోహ్లితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.  మరోవైపు లండన్‌లో సోమవారం జరిగిన కోహ్లి చారిటీ డిన్నర్‌ కార్యక్రమానికి భారత ఆటగాళ్లు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement