జిందాను గెలిపించిన కలీమ్ | kalim khan make to win game | Sakshi
Sakshi News home page

జిందాను గెలిపించిన కలీమ్

Nov 5 2013 11:59 PM | Updated on Sep 4 2018 5:07 PM

కలీమ్ ఖాన్ (99 బంతుల్లో 118 నాటౌట్, 15 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో జిందా జట్టును గెలిపించాడు.

సాక్షి, హైదరాబాద్:  కలీమ్ ఖాన్ (99 బంతుల్లో 118 నాటౌట్, 15 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో జిందా జట్టును గెలిపించాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో జిందా జట్టు 4 వికెట్ల తేడాతో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్‌పై గెలుపొందింది. తొలి రోజు ఆటలో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు 59 ఓవర్లలో 215 పరుగులు చేసి ఆలౌటైంది.
 
 జిందా బౌలర్లలో అవినాశ్, శ్రవణ్, సాక్షం గోగియా తలా 3 వికెట్లు తీశారు. రెండో రోజు మంగళవారం లక్ష్యఛేదనకు దిగిన జిందా జట్టు 46 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి నెగ్గింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనా కలీమ్ ఖాన్... లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సయ్యద్ షాబాజ్ (27), సాక్షం గోగియా (24 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ బౌలర్లలో భరణ్ కుమార్ 3, అమిత్ సింగ్ 2 వికెట్లు తీశారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు (తొలిరోజు ఆట)
 కొసరాజు: 206 (చరణ్‌సాయితేజ 120, రేయిస్ 32; నాగరాజు 5/67), గౌడ్స్ ఎలెవన్: 98/3 (సాయినాథ్ 30)
 
 అవర్స్: 121 (జైనుద్దీన్ ఖాద్రీ 39; ఒమర్ ఖాన్ 4/62, అంకిత్‌శర్మ 3/14, యుధీశ్ 3/27), హెచ్‌బీసీసీ: 124/5 (సాయితేజ 3/45)
 
 ఎ-4 డివిజన్ వన్డే లీగ్
 సఫిల్‌గూడ: 114 (నటరాజ్ 38; కరణ్ కన్నన్ 6/37, మీర్జా మాజ్ జబల్ 4/18), ఎలిజెంట్: 115/2 (సయ్యద్ మాజిద్ అలీ 52, అజయ్ రెడ్డి 39)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement