ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌కు జ్యోతిక శ్రీ | Jyothika Sri to Asian Youth Athletics | Sakshi
Sakshi News home page

ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌కు జ్యోతిక శ్రీ

Apr 26 2017 12:39 AM | Updated on Sep 5 2017 9:40 AM

ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌కు జ్యోతిక శ్రీ

ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌కు జ్యోతిక శ్రీ

హైదరాబాద్‌లో ఇటీవలే జరిగిన జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతిక శ్రీ భారత

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇటీవలే జరిగిన జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతిక శ్రీ భారత జట్టులోకి ఎంపికైంది. బ్యాంకాక్‌లో వచ్చే నెల 20 నుంచి 23 వరకు జరిగే ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో జ్యోతిక శ్రీ బాలికల 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగుతుంది.

మొత్తం 37 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు పాటియాలా, సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement