బ్రిటిష్‌ ఓపెన్‌ నుంచి జోష్నా చినప్ప ఔట్‌ | Joshna Chinappa in second round of British Open | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ ఓపెన్‌ నుంచి జోష్నా చినప్ప ఔట్‌

Mar 24 2017 12:42 AM | Updated on Sep 5 2017 6:54 AM

భారత స్టార్‌ క్రీడాకారిణి జోష్నా చినప్ప ప్రతిష్టాత్మక బ్రిటీష్‌ ఓపెన్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ నుంచి రెండో రౌండ్లోనే నిష్క్రమించింది.

చెన్నై: భారత స్టార్‌ క్రీడాకారిణి జోష్నా చినప్ప ప్రతిష్టాత్మక బ్రిటీష్‌ ఓపెన్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ నుంచి రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన పోరులో ఆమె 8–11, 7–11, 7–11తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ రనీమ్‌ ఎల్‌ వెలిలీ (ఈజిప్టు) చేతిలో పరాజయం చవిచూసింది.

2015లో జరిగిన ఖతార్‌ క్లాసిక్‌ ఈవెంట్‌లో ఇదే రనీమ్‌ను భారత అమ్మాయి కంగుతినిపించింది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ప్రపంచ మాజీ చాంపియన్‌ చేతిలో 27 నిమిషాల్లోనే చేతులెత్తేసింది. ఇదివరకే దీపికా పళ్లికల్, పురుషుల ఈవెంట్‌లో సౌరవ్‌ ఘోషల్‌ ఓటమిపాలు కావడంతో భారత పోరాటం ఈ టోర్నీలో ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement