జీతూ–హీనా జంట పసిడి గురి

Jayutu-Hina is playing a pair of pasidi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో తొలి రోజే భారత్‌ పసిడి బోణీ చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత స్టార్‌ షూటర్స్‌ జీతూ రాయ్‌–హీనా సిద్ధూ ద్వయం స్వర్ణ పతకాన్ని సాధించింది. ఐదు జోడీలు పాల్గొన్న ఫైనల్లో జీతూ–హీనా జంట 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగాన్ని మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు.

గొబెర్‌విల్లీ–ఫౌకెట్‌ (ఫ్రాన్స్‌–481.1 పాయింట్లు) జంట రజతం నెగ్గగా... యాంగ్‌ వీ–కాయ్‌ జియోజుయ్‌ (చైనా–418.2 పాయింట్లు) జోడీ కాంస్యం సాధించింది. ఈ ఏడాది 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత్‌కు లభించిన మూడో స్వర్ణమిది. న్యూఢిల్లీ, గబాలాలలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీల్లో జీతూ–హీనా జంట పసిడి పతకాలు గెలిచింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో దీపక్‌ –మేఘన (భారత్‌) జోడీ నాలుగో స్థానంలో నిలిచింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top