యువ భారత్‌దే సిరీస్‌ | Jaiswal hits ton as India U-19 win one-day series in Sri Lanka | Sakshi
Sakshi News home page

యువ భారత్‌దే సిరీస్‌

Aug 11 2018 1:30 AM | Updated on Aug 11 2018 1:30 AM

Jaiswal hits ton as India U-19 win one-day series in Sri Lanka - Sakshi

కొలంబో: ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (114 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక అండర్‌–19 జట్టుతో జరిగిన చివరి యూత్‌ వన్డేలో  భారత అండర్‌–19 జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను యువ భారత్‌ 3–2తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో మోహిత్‌ జాంగ్రా రెండు... హైదరాబాద్‌ క్రికెటర్‌ అజయ్‌ దేవ్‌గౌడ్, సిద్ధార్థ్‌ దేశాయ్, హర్‌‡్ష త్యాగి, ఆయుష్‌ బదోని, సమీర్‌ చౌదరి ఒక్కో వికెట్‌ పడగొట్టారు.  ఆ తర్వాత యువ భారత్‌ 42.4 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి తొలి వికెట్‌కు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (38; 6 ఫోర్లు)తో 71 పరుగులు... పవన్‌ షా (36)తో రెండో వికెట్‌కు 72 పరుగులు, కెప్టెన్‌ ఆర్యన్‌ జుయల్‌ (22 నాటౌట్‌)తో మూడో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జతచేసి భారత్‌కు విజయాన్నందించాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement